Jul 29,2023 22:16

వృద్ధాశ్రమంలో పౌష్టిక ఆహారం, పండ్లను పంపిణీ చేస్తున్న నాయకులు

      హిందూపురం : ఇమామే హసన్‌, ఇమామ్‌ హుస్సేన్‌ సహా పలువురి బలిదానాలను స్మరిస్తూ, ఇస్లామిక్‌ నూతన ఏడాది ఆరంభంమైన మొహరం పురస్కరించుకుని శనివారం నాడు ముస్లిం సోదరులు సేవా మందిరంలో క్రైస్తవులు నిర్వహిస్తున్న వద్ధాశ్రమంలో పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నియంతలపై జరిగిపన పోరాటానికి ప్రతిరూపంగా మొహరంను చెప్పవచ్చన్నారు. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం 14వ శతాబ్ధం క్రితమే మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రత్మక పోరాటం మొహరం అన్నారు. ఈ పోరాటంలో మహమ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామే హుస్సేన్‌ బలిదానం అనంతరం మూడవ రోజు షహాదత్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమర్‌ ఫారూక్‌ ఖాన్‌, ముఫ్టీ ఇబ్రహీం, హాఫిజ్‌ ఇలియాజ్‌, సాదిక్‌, చాందు, ఉబెదుల్లా హుస్సేన్‌, కౌన్సిలర్‌ ఇర్షాద్‌ అహ్మద్‌, ముతవల్లీ అన్సార్‌, అస్లాం, ఇదరీస్‌, జనవిజ్ఞాన వేదిక అతావుల్లా, అబుల్‌ రహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.