గరుగుబిల్లి: కొమరాడ ఐసిడిఎస్. ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని నాగూరులో శుక్రవారం అంగన్వాడీ వర్కర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్‌ను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు, మండలప్రత్యేక అధికారి ఒ ప్రభాకర్, ఎంపిడిఒ జి.పైడితల్లి తదితరులు పరిశీలించారు. అనంతరం భాస్కరరావు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో రావివలస పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ కె.కార్తీక్, ఎంపిడిఒ కార్యాలయం ఎఒ నాలి అర్జునరావు, వైసిపి నాయకులు కేతిరెడ్డి అచ్యుతరావు, అక్కేన వెంకట నాయుడు, వైద్యసిబ్బంది గుంట్రెడ్డి.సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.










