ధర్మవరం టౌన్ : జగనన్న గోరుముద్ద కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే భోజనంలో తప్పకుండా మెనూ పాటించాలని నిర్వాహకులను కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం నాడు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాలలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం కింద మద్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు. మెనూ ప్రకారం భోజనాన్ని వండారా.? లేదా.? అన్న దానిని పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని రుచిచూసి సంతప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం నాణ్యతగా ఉండే ఆహారాన్ని విద్యార్థులకు అందించడం అత్యంత కీలకమన్నారు. అంతకుమునుపు లక్ష్మీచెన్నకేశవపురంలోని అంగన్వాడీ 12 కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. కేంద్రాలకు ఎన్ని కోడిగుడ్లు వస్తున్నాయి.? స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది..? అన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించార. ఈ పరిశీలనలో ఆయన వెంట జిల్లా ఇన్‌ఛార్జి డిఇఒ మీనాక్షమ్మ, తహశీల్దార్ యుగేశ్వరదేవి, హెచ్‌ఎం శైలజ ఉన్నారు.
అమత్ సరోవర్ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ అరుణ్ బాబు
అమత్ సరోవర్ పనుల పరిశీలన
మండల పరిధిలోని పోతులనాగేపల్లి గ్రామం వద్ద ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంకింద జరుగుతున్న అమత్ సరోవర్ (నీటికుంట) పనులను మంగళవారం నాడు కలెక్టర్ అరుణ్‌బాబు పరిశీలించారు. రూ.20 లక్షల అంచనా మొత్తంతో జరుగుతున్న పనుల వద్ద కూలీలతో మాట్లాడారు. ఉదయం త్వరగా వచ్చి ఎండ దెబ్బ తగలకుండా పనులు చేసుకోవాలన్నారు. పనిని కొలతల ప్రకారం కచ్ఛితంగా చేసినప్పుడే పూర్తి కూలి పడుతుందని కూలీలకు కలెక్టర్ తెలియజేశారు. కూలీలు అందరికీ పనులను కల్పించడంలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదన్నారు. పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీలు వెంకటాచలపతి, శివశంకర్, ఎంపీడీవో మమతాదేవి, ఏపీవో అనిల్‌కుమార్, ఈసీ హరిబాబు, జేఈ నాగేంద్ర, టెక్నికల్ అసిస్టెంట్ చంద్రకళ, ప్లాంటేషన్ సూపర్‌వైజర్ అరుణ, పంచాతీయతీ కార్యదర్శి మురళీ, ఫీల్డ్ అసిస్టెంట్ కంభం మురళీ, వైసిపి నాయకులు వెంకట్రామిరెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు.










