Nov 01,2023 19:12

వంట పాత్రలు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-ఉలవపాడు : స్థానిక మండల విద్యా వనరుల శాఖ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న వంట పాత్రలను పాఠశాలలకు అందజేశారు. వీటినిమండల కో ఆప్షన్‌ సభ్యులు ఎస్‌.కే ఖాదర్‌ బాషా పాల్గొని అందజేయడం జరిగింది. ఎంఈఓ ప్రసాద్‌ రావు మాట్లాడుతూ మండల పరిధిలో 63 పాఠశాలలు ఉన్నాయని వాటికి సంబంధించిన పాత్రలను అందరికి అందజేసినట్లు తెలిపారు. ఎంఇఒ రమణయ్య మాట్లాడారు. సి ఆర్‌ పి లు ప్రసాద్‌ ప్రసాద్‌ కష్ణ రవి ధనలక్ష్మి ఉపాధ్యాయులు సిఆర్పి సిబ్బంది కంప్యూటర్‌ ఆపరేటర్‌ రమాదేవి ఉన్నారు.