gate vitharana
పాఠశాలకు గేటు వితరణ
ప్రజాశక్తి-ఉయ్యూరు
విద్యనేర్చుకున్న పాఠశాలకు తోచిన విధంగా తోడ్పడాలన్న ఉద్దేశంతో కాటూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-2005 సంవత్సర పదో తరగతి విద్యార్థులు పాఠశాల ప్రహరీగోడకు రూ.50వేలు విలువచేసే గేటు వితరణ అందజేశారు. విద్యనేర్చుకున్న పాఠశాలకు గేటు ఏర్పాటుచేయడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ కొడాలి ఆశా జ్యోతి, ఎంపీటీసీలు తోట శ్రీ లక్ష్మి, సజ్జా అనూప ప్రశంసించారు. పూర్వ విద్యార్థులు మీగ డ శ్రీనివాసరావు, శివశంకర్, బండి సురేశ్, వీరమాచినేని గీత, బోయిన క్రీస్తు, కె. ఆంజనేయులు, తాడేపల్లి బ్రహ్మం, పి. రాజేశ్ పాల్గొన్నారు.










