ప్రజాశక్తి - మచిలీపట్నంఅర్బన్ : ఫిజిక్స్, బయాలజీ, మాథ్స్ సబ్జెక్టులలో విద్యార్థినులకు ఇన్చార్డ్ కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ పాఠాలు బోధించారు. స్థానిక 44 వ డివిజనులోని నగరపాలక సంస్థ బాలికల పాఠశాలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసిన జెసి సబ్జెక్టుల్లో పిల్లల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. ఫిజిక్స్ ఉపాధ్యాయినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థినులకు ప్రధానంగా సైన్స్ సబ్జెక్టులో వారి పరిజ్ఞానాన్ని పరీక్షించడం జరిగిందన్నారు. అయితే బయోలజీలో విద్యార్థినులు సంతప్తికరంగా సమాధానాలు చెప్పినా, ఫిజిక్స్ సబ్జెక్టులో మాత్రం పిల్లలు పెద్దగా పరిజ్ఞానం చూపలేదని తెలిపారు. కాగా ఫిజిక్స్ ఉపాధ్యియినికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులకు ఆదేశించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు అందించే మిడ్డే మీల్స్ తీరు, నాణ్యత పరిశీలించాని చెప్పారు. ఇకపై జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.










