Mar 14,2023 17:36

vinatipatranni estunna beenni lingam

పాస్టర్లకు గౌరవవేతనం ఇవ్వాలి
సజ్జల రామకృష్ణారెడ్డిని కోరిన డాక్టర్‌ బెన్నీ లింగం
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు
అర్హులైన పాస్టర్స్‌కు గౌరవ వేతనం మంజూరు కోసం తాడేపల్లిలో ఎపి ప్రభుత్వ సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డిని మంగళవారం అసోసియేషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటెడ్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ జాన్‌ బెన్నీ లింగం మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పేద దైవ సేవకులకు గౌరవ వేతనం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మొదటి దశలో 5196 మందికి విడుదల చేశారని వివరించారు. రాష్ట్రంలో పేద పాస్టర్లు 40 వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. అర్హులైన వారు గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేసుకోటానికి అవకాశం కల్పించాలని కోరానన్నారు. తమ అభ్యర్థన స్వీకరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీ పేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. అర్హులైన వారంతా నూతనంగా గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనికిగాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి పాస్టర్లు, సంఘం తరఫున డాక్టర్‌ జాన్‌ బెన్నీ లింగం ప్రత్యేకమైన కృతజ్ఞత
తెలిపారు.