Apr 25,2023 22:11

కదిరిలో వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి గోరంట్ల : పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామనిపెనుగొండ శాసనసభ్యులు శంకర్‌ నారాయణ అన్నారు. మండలంలోని గొల్లపల్లి బిఎన్‌ తండా, బోయలపల్లి, బత్తలపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రమీల మూర్తి, జెడ్పీటీసీ జయరాం నాయక్‌, వైస్‌ ఎంపీపీ నాగభూషణ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు శంకర్‌ నాయక్‌, లక్ష్మీనరసప్ప తదితరులు పాల్గొన్నారు.
కదిరి అర్బన్‌ : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే పివి. సిద్ధారెడ్డి అన్నారు. మండల పరిధిలోనిరాందాస్‌ నాయక్‌ తండా, మీటే నాయక్‌ తండా, బొడే నాయక్‌ తండా, వై.కొత్తపల్లి, నాగూరివండ్లపల్లి, రొద్దంవారిపల్లిలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమర్నాథ్‌ రెడ్డి, జడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, కో ఆప్షన్‌ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
ఓబుల దేవర చెరువు : రాష్ట్రాభివృద్ధి వైసిపి ప్రభుత్వంతోనే సాధ్యమని తుమ్మలకుంట్లపల్లి సచివాలయ కన్వీనర్‌ చంద్ర మౌళి నాయుడు అన్నారు. మండలంలోని టిజ కుంట్లపల్లిలో మానమ్మకం నువ్వే జగన్‌ అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీదేవి, ఎంపీటీసీ ప్రభాకర్‌ నాయుడు, డీలర్‌ మధుసూదన నాయుడు, పెద్ద రంగప్ప , సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ అగ్గి నరసింహ, కార్యకర్తలు మనోహర్‌, కిష్టప్ప, రాము తదితరులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వైసిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని సచివాలయాల మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం మండలంలోని అఫ్రాచెరువు గ్రామంలో 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. లబ్ధిదారుల అనుమతితో ఇంటి తలుపులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉన్న స్టికర్‌ను అతికించారు. ఐదు ప్రశ్నలు అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు వెంకటరంగారెడ్డి. సచివాలయ కన్వీనర్‌ రాజు వీరారెడ్డి, మనోహర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, బండి వీరనారప్ప, అంకె వీరనారప్ప, దివాకరరెడ్డి, వాలెంటర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.