Sep 06,2023 17:25

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
    ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పులి రామన్నగూడెం సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ సీనియర్‌ నాయకులు మడకం గంగరాజు లేకపోవడం పార్టీకి తీరని లోటని జిల్లా కార్యదర్శి సుధాకర్‌ తెలిపారు. బుధవారం మడకం గంగరాజు కుటుంబాన్ని సిపిఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి.సుధాకర్‌తో పాటు పార్టీ నాయకులు ఎస్‌.రామ్మోహన్‌, కారం రాఘవ, పోరండ్ల శ్రీనివాసు, మాజీ సర్పంచులు కుంజా గంగరాజు, కుంజా కన్నమ్మ, తగరం బాబురావు , జి. లక్ష్మీనారాయణ, కురసం లత, స్థానిక సర్పంచి మడి శ్రీరాములు, ఎంపిటిసి మడకం వెంకటలక్ష్మి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగరాజు ఇంక లేకపోవడం బాధాకరమని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు తెలిపారు.