Jun 09,2023 22:31

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారధి

ప్రజాశక్తి -పెనుకొండ : వచ్చే ఎన్నికల్లో టిడిపికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పనిచేద్దామని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు నరసింహులు యాదవ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణం లోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ నియోజకవర్గం చర్చా వేదిక ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి నియోజకవర్గ పరిశీలకులు నరసింహులు యాదవ్‌ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. నియోజకవర్గంలో గ్రూప్‌ రాజకీయాలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.అనంతరం బికె.పార్థసారథి మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి సైకో పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టి మన భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకొందామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ మొదటి మేనిఫెస్టోను పెనుకొండ నియోజకవర్గం గ్రామ గ్రామాలలోకి తీసుకొని వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్నవెంకటరాముడు, రామక్రిష్టప్ప, కురుబ కృష్ణమూర్తి, కేశవయ్య, అశ్వర్థనారాయణ, హుజూర్‌, రొద్దం నరసింహులు, చిన్నప్పయ్య, భానుకీర్తి, సిద్దలింగప్ప, సోమశేఖర్‌,నరహరి,సిద్దయ్య, లక్ష్మిరెడ్డి, రవి శంకర్‌, గాయత్రి,నాగమణి, అనసూయమ్మ, బేబీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.