Oct 19,2023 20:14

నంచర్లలో రీ సర్వేను పరిశీలిస్తున్న తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
రైతులకు ఏ సమస్య ఎదురవకుండా రీ సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం మండలంలోని నంచర్ల గ్రామంలో రెవెన్యూ కార్యదర్శి తిమ్మప్ప, విలేజ్‌ సర్వేయర్లు రోజి చేపట్టిన పొలం రీ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్న సమయంలో సంబంధిత రైతులందరికీ సమాచారం ముందుగా ఇస్తామని తెలిపారు. రైతులకు ఏ సమస్యలూ ఎదురవకుండా సర్వే నిర్వహిస్తున్నప్పుడు దగ్గర్లోనే ఉండాలని సూచించారు. అధికారులకు ఏమైనా సమస్య ఎదురైతే రైతులకు పూర్వాపరాలు అడిగి తెలుసుకుంటారన్నారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు చాలా సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరిస్తూ పోతున్నామన్నారు. రైతులు, గ్రామ సేవకులు పాల్గొన్నారు.