పుట్టపర్తి రూరల్: శ్రీసత్యసాయి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్న పోలీసుల బదిలీలను పారదర్శకంగా చేపట్టినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. జిల్లాలో ని 122 మంది కానిస్టేబుళ్లకు శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా బదిలీలు నిర్వహించారు. ముందుగా కౌన్సిలింగ్‌కు హాజరైన సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. బదిలీల్లో సిఫార్సులకు తావులేకుండా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో ఎస్పీతో పాటు ఏఎస్పీ కెవి రామకృష్ణప్రసాద్, ఎస్‌బి సిఐ రవీందర్ రెడ్డి, సిసి రాఘవేంద్ర, ఏ1 సూర్యతేజ, ఐటీ కోర్ సిబ్బంది, ఆఫీసు పర్యవేక్షకులు కామేశ్వరరావు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.










