ప్రజాశక్తి-గన్నవరం : పాల ఉత్పత్తి పెంపుదలకు పాడి రైతుల కషి చేయాలని కష్ణామిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. శుక్రవారం ముస్తాబాద మినీ కళ్యాణ మండపంలో జరిగిన ది ముస్తాబాద పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం బోనస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన చలసాని మాట్లాడుతూ లక్షలాది రైతు కుటుంబాలకు యూనియన్ సేవలందిస్తుందని చెప్పారు. యూనియన్ ఆధ్వర్యంలో క్షీరబంధు, కళ్యాణమస్తు, బీమా సౌకర్యాలు అందిస్తున్నట్లు వివరించారు. నాణ్యమైన సెమను పంపిణీ చేస్తున్నామని, ఈ సేవలన్ని పాలకేంద్రాల వద్ద ప్రదర్శించి పాడి రైతులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ముస్తాబాద పాలకేంద్రం ద్వారా 123 మంది ఉత్పత్తిదారులకు రూ.2లక్షలు బోనస్ ను పంపిణీ చేశారు. ప్రతి నాలుగు నెలలకు క్రమం తప్పకుండా బోనస్ అందిస్తున్న యూనియన్ పాడి రైతులదని చెప్పారు. ముస్తాబాద పాలకేంద్రం అధ్యక్షుడు కడియాల గోపాలరావు(కోటయ్య) కషితో ఈ కేంద్రం గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రగతి సాధించటంతో పాటు విశేష అభివద్ధి స్వంతం చేసుకుందని ఆయనను సత్కరించారు. జిల్లా డైరెక్టర్లు దాసరి వెంకట బాలవర్ధనరావు, పాలడుగు నాని. పలగాని కొండలరావు, జీఎం అనిల్ కుమార్, రూట్ మేనేజర్ కోటా ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయుడు కడియాల గోపాలరావు, రైతులు హాజరయ్యారు. పాలకేంద్రం యాజమాన్యం అతిథులను ఘనంగా సత్కరించింది.










