Aug 11,2023 20:51

పూలమాలలు వేసి సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 2 నుంచి 7 వరకు ఆదోని నుంచి కర్నూలు వరకు చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న నాయకులను సన్మానించారు. శుక్రవారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, వెంకటేశులు, పట్టణ నాయకులు శ్రీనివాసులు, వెంకటేష్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్‌, మండల కార్యదర్శి లింగన్న మాట్లాడారు. స్థానిక సమస్యలతోపాటు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా సాగిందని తెలిపారు. పాదయాత్ర ప్రభావం అధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మహా పాదయాత్ర పట్ల ప్రజల్లో కూడా సానుకూల చర్చ నడిచిందన్నారు. ఆరు రోజులపాటు కొనసాగిన పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి అడుగడుగునా ఘన స్వాగతం లభించిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్నీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. నాయకులు గోపాల్‌, తిప్పన, వీరారెడ్డి, నాగరాజ్‌, ముక్కన్న, మాబాష, నాగేంద్ర, కృష్ణమూర్తి పాల్గొన్నారు.