ప్రజాశక్తి - సాలూరు : రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే హక్కు వైసిపికే ఉందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. పట్టణంలోని సీతారామ ధర్మశాలలో మున్సిపాలిటీ, మండలాలకు కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ శనివారం జరిగింది. మున్సిపాలిటీలో 134మందికి, మండలం లో 368మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. ఫించన్లతో పాటు జగనన్న విద్యా దీవెన, జగనన్న చేయూత,అమ్మ ఒడి, విద్యాకానుక, జగనన్న చేదోడు వంటి పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు బాధ్యత వహించాలని కోరారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంతా ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేస్తే పట్టణంలోని సచివాలయాలకు రూ.40లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని చెప్పారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, జర్జాపు దీప్తి, అర్బన్ బ్యాంక్ అధ్యక్షుడు జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ గొర్లి జగన్మోహన్ రావు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ రెడ్డి పద్మావతి, సీనియర్ నాయకులు దండి శ్రీనివాసరావు, సువ్వాడ రామకష్ణ, కౌన్సిలర్ లు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
పాచిపెంట : మండలానికి కొత్తగా మంజూరైన పింఛన్లను డిప్యూటీ సిఎం రాజన్నదొర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బి.ప్రమీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమం జరిగింది. మండలంలో కొత్తగా 375 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. కార్యక్రమంలో జెడ్‌పి వైస్‌చైర్మన్ కె.సింహాచలం, వైస్ ఎంపిపి ఎం.నారాయణ, వీరంద్ర, ఎంపిడిఒ జి.పార్వతి, వైసిపి నాయకులు పి.వీరంనాయుడు, డోల బాబ్జీ, పి.గౌరీశ్వరరావు, పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలానికి కొత్తగా మంజూరైన పింఛన్లను స్థానిక ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి శనివారం పంపిణీ చేశారు. ఎంపిపి ఉరిటి రామారావు అధ్యక్షతన వైయస్సార్ పింఛన్ కానుక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 8,222 వేల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఎం. బాపూజీ నాయుడు ఎంపిడిఒ జి.పార్వతి, తహశీల్దార్ జివి జనార్ధన్, ఎంఇఒ నాగిరెడ్డి నాగభూషణరావు, న్యాయవాది కె.కూర్మినాయుడు, పలువురు అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్ : కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మండలంలోని నర్సిపురంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో 2300 కొత్తగా పింఛన్లు మంజూరు కాగా, ఇందులో ఒక్క పార్వతీపురం మండలానికి 630 మంజూరయ్యాయని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్ధ జగన్నాధరావు, బంకరు రవికుమార్, ఎంపిడిఒ రమణమూర్తి, ఇఒపిఆర్‌డి ఎన్.కృష్ణుడు, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు భీమవరపు కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి వి.గురురాజు, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, పిఎసిఎస్ చైర్మన్ కాపారపు సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.










