Sep 04,2023 20:51

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, జెసి, సబ్‌కలెక్టర్‌

పార్వతీపురం: ఇంటింటి విచారణలో భాగంగా తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం ఓటరు జాబితా తయారీపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇంటింటి ఓటరు విచారణ చేసి శాశ్వతంగా గ్రామాలను వదలిన వారిని, మృతి చెందిన వారిని, డుప్లికేట్‌ ఎంట్రీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తొలగించే కార్యక్రమం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెల 7 నాటికి పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవిందరావు, పార్వతీపురం ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, డిఆర్‌ఒ జె.వెంకట రావు, ఆర్‌డిఒ కె.హేమలత పాల్గొన్నారు.