ఓటమి భయంతోనే లోకేష్‌పై వైసీపీ అసత్య ప్రచారం
టిడిపి ఎస్‌సి సెల్ నాయకులు
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా )
వైసీపీ నాయకులు ఓటమి భయంతోనే 'దళితులు పీకిందేమీ లేదు' అనే పేరుతో నారా లోకేష్ పై అసత్య ప్రచారాన్ని ప్రారంభించారని టిడిపి ఎస్‌సి సెల్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ అనని మాటలు అన్నట్లుగా ఫొటోలు, మాటలు మార్ఫింగ్ చేసి చిల్లర రాజకీయాలకు తెరలేపారని ఖండించారు. దళితులకు తెలుగుదేశం పార్టీ అత్యంత గౌరవాన్ని కల్పించి సంక్షేమాన్ని అందించి వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచి సమాజంలో వారికి రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానాన్ని కల్పించిందన్నారు. వైసీపీ పార్టీ వారిని కేవలం ఓటర్లుగా చూస్తూ వారిపై దాడులు, హత్యలు చేయిస్తూ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. ఇంకా వైసీపీ విషప్రచారాన్ని నమ్మే పరిస్థితిలో ఈ ప్రజలు లేరని తెలుసుకోవాలని హితవు పలికారు. ఈ విషప్రచారాన్ని ఆపకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పబోదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్ , మోటమర్రి బాబా ప్రసాద్, పిప్పళ్ళ వెంకట కాంతా రావు, పార్లమెంట్ ఎస్సి సెల్ ఆదినారాయణ, బత్తిన దాస్,గుమ్మడి విద్యాసాగర్,గోకుల్ శివ, వసంత కుమారి,చిన్నం శేఖర్,చిట్టూరి యువరాజు, లింగం విజరు, సలీం, అయ్యప్ప, శివకోటి రాజేంద్ర ప్రసాద్, తిరుమాని నారాయణ,చీలి సుమన్, శామ్యూల్, చౌదరి, కిలాని అచ్చన్నాయుడు, సుంకర నవీన్ కుమార్ (చిన్ని), వడ్లమూడి వెంకట సుబ్బారావు, అంజి, మరియు ఎస్సి సెల్ నాయకులు , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.










