ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : రాష్ట్రంలో టిడిప కి వస్తున్న ప్రజాదారణ చూసి ఓర్వలేక కడుపు మంట, అక్కసుతోనే అక్రమంగా కేసులు బనాయించి సంక్షేమం, అభివృద్ధి చేసిన చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టారని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విమర్శించారు. మేము సైతం- బాబుకోసం'' అన్న కార్యక్రమంలో భాగంగా గుమ్మలక్ష్మీపురంలో టిడిపి శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శత్రు చర్ల విజయరామరాజు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీ జగదీశ్వరి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబును విడుదల చేసే వరకూ తమ పోరాటాలు ఆగవని హెచ్చరించారు. చంద్రబాబునాయుడును వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా వైసిపి గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం మంటూ శనివారం రాత్రి 7 గంటల 5 నిమిషాల పాటు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. బయటకు వచ్చి దీపాలు, సెల్‌ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుకుపార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ , ఎంపిపి బొంగు సురేష్, నియోజకవర్గ మహిళ దాసరి జ్యోతిర్మయి, అరుకు పార్లమెంట్ ఎస్‌టి సెల్ ప్రధానకార్యదర్శి నందివాడ కష్ణబాబు, అరుకు పార్లమెంట్ కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు ఎం.సత్యంనాయుడు, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోల రంజిత్ కుమార్, అరుకు పార్లమెంట్ కార్యవర్గ సభ్యులు ఎం.విజయఅంకుశం, తెలుగు మహిళా విభాగం కార్యదర్శి వెంపటాపు భారతి, మండల కన్వీనర్ పాడి సుదర్శన్ రావు, కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్ : మండలంలోని జమదాలలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌తో కలిసి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిమినల్ మనస్తత్వంతో ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్న కారణంగా ప్రధాన ప్రతిపక్షనేతపై అక్రమ కేసులు జైలు పాలుచేయడాన్ని ప్రజలంతా ఏవగించుకుంటున్నారని అన్నారు. ఈ రిలే నిరాహారదీక్షకు జనసేనతో పాటు మండలానికి చెందిన పలు గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 100 మంది టిడిపిలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డి భారతి, ఎంపిటిసి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుల దొగ్గ మోహనరావు, జి.వెంకటనాయుడు, బొబ్బిలి వేణుగోపాలరావు, కొల్లి తిరుపతిరావు, మాజీ సర్పంచులు బేత లక్ష్మణరావు, గొరజాన చంద్రమౌళి, తాన్న తిరుపతిరావు, నాయకులు పోల సత్యనారాయణ, కౌన్సిలర్లు కోరాడ నారాయణరావు, బర్నాల సీతారాం, జాగాన రవికుమార్, పాలకొండ రాజశేఖర్, సిరిపురపుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మక్కువ : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మార్కొండపుట్టిలో శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యాన పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా సంధ్యారాని మాట్లాడురతూ చంద్రబాబు విడుదల అయ్యేవరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మావుడి ప్రసాదరావు నాయుడు, మండల టిడిపి అధ్యక్షులు గొల్ల వేణుగోపాల్, మాజీ సర్పంచ్ ఎ. తిరుపతిరావు, కార్యదర్శి బి.గౌరీశంకర్రావు, పి.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది కార్యకర్తలతో కార్యక్రమం అనంతరం గడపగడపకు కార్యక్రమం చేపట్టారు.
సీతంపేట : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన నిరాహారదీక్షలు కొనసాగాయి. రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి బిడ్డీక చంద్రరావు, అరకు పార్లమెంటరీ అధ్యక్షులు నివర్తి శశికుమార్, సీతంపేట మండల పార్టీ అధ్యక్షులు సవర తోట మొఖలింగం, తదితరులు పాల్గొన్నారు.










