Apr 19,2023 22:46

ఎస్పీ మాధవరెడ్డిని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్న చిలకం

ప్రజాశక్తి - ధర్మవరం టౌన్‌ : ధర్మవరం డివిజన్‌కు ఐపిఎస్‌ అధికారిని నియమించి శాంతి భద్రతలను కాపాడాలని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి ఎస్పీ మాధవరెడ్డిని కోరారు. ఇటీవల సత్యసాయి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మాధవరెడ్డిని చిలకం మధుసూదన్‌రెడ్డి బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలి పారు. ధర్మవరంలో శాంతిభద్రతలను నిరంతరం కాపాడాలని ఆయన ఈసందర్భంగా ఎస్పీని కోరారు. అదేవిధంగా అడిషనల్‌ ఎస్పీ రామకృష్ణప్రసాద్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈకార్యక్రమంలో ఆపార్టీ జిల్లా ప్రధానకార్యదర్శులు పత్తి చంద్రశేఖర్‌, అబ్దుల్‌ అబు, పుట్టపర్తి పట్టణ అధ్యక్షులు బొగ్గరం శ్రీనివాసులు, నాయకులు తిరుపతేంద్ర తదితరులు పాల్గొన్నారు.