Oct 21,2023 01:00
పొదిలిలో నిరాహార దీక్షలు చేస్తున్న యుటిఎఫ్‌ ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాను అధికారంలోకివచ్చిన వారంలోగా సిపిఎస్‌ రద్దు చేసి ఓపిఎస్‌ను అమలుచేస్తానని ఇచ్చిన హామీని అమలు పరచాలని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి బాలవెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక కాలేజి రోడ్డులో యుటిఎఫ్‌ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఓపిఎస్‌ అమలు కోరుతూ పొదిలి తాలూకా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలను యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పిల్లి రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సంందర్భంగా బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేసేంతవరకు తాము ఉద్యమిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వై గురవయ్య, జె వెంకటేశ్వర్లు నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో బుజ్జిబాబు, మూడు మండలాల యుటిఎఫ్‌ అధ్యక్ష కార్యదర్శులు పివెంకటేశ్వర్లు, జి రమేష్‌, బి కృపారావు, జిశ్రీనివాసులు, సత్యనారాయణ రెడ్డి, జెవివి ఐజాక్‌, వెన్నెల మల్లికార్జున, శింగంపల్లి సుబ్బారావు, బాల కాశిరెడ్డి, చవలం వెంకటేశ్వర్లు, సిహెచ్‌ మురళీకృష్ణ ప్రసాద్‌, ఎస్‌కె జిలానీ, వి సుదర్శన్‌ రెడ్డి, ఎస్‌కె నాసర్‌ మహమ్మద్‌, శివారెడ్డి, ఓబుల్‌ రెడ్డి, కె ఆదిలక్ష్మి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.