జిపిఎస్ బిల్లు ప్రతులను దహనం చేస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-వీరఘట్టం : సిపిఎస్, జిపిఎస్ రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్ ఆధ్వర్యాన బుధవారం రాత్రి వీరఘట్టంలో ఎంఆర్‌సి వద్ద నిరసన చేపట్టారు. జిపిఎస్ బిల్లు ప్రతులను దహనం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా జిపిఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, నాయకులు కె.గోవిందరావు, వి.శ్రీధర్, వి.అన్నాజీరావు, ఎ.చంద్రమోహన్, ఎస్.గణేష్, తదితరులు పాల్గొన్నారు.










