ప్రజాశక్తి-ధర్మవరం : ధర్మవరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని మారుతి నగర్ లో వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.










