ఏనుగుదాడిలో ధ్వంసమైన గేటు
ప్రజాశక్తి-కొమరాడ : మరోమారు ఒంటరి ఏనుగు హరి మండలంలో బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారు జామున మండలంలోని విక్రమపురం సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి ఏనుగు హల్‌చల్ చేసింది. రైల్వే గేటును ధ్వంసం చేసింది. దీంతో సమీపంలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. కొద్ది రోజుల క్రితమే అంతర్రాష్ట్ర రహదారిలో ప్రయివేటు బస్సుపై ఒంటరి ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. ఏనుగుల గుంపు నుంచి ఒంటరి ఏనుగు హరి విడిపోయి సుమారు నెలరోజులు కాబోతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఒంటరి ఏనుగు సంచారం పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.










