Sep 17,2023 13:37

ప్రజాశక్తి-పుట్లూరు : ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గరుకు చింతపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల మేరకు గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 72 సంవత్సరాలు తోట కాటికి పనిచేయడానికి వెళ్లి బావి పక్కన గడ్డి ఏపుగా ఉండడంతో గడ్డిని తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడడంతో తలకు గాయాలై మృతి చెందాడు. కొడుకు నారాయణరెడ్డి తన తండ్రి లక్ష్మి రెడ్డికి తోట కాడికి అన్నం తీసుకపోయి తోటంతా పరిశీలించిన తండ్రి లక్ష్మి కనిపించకపోవడంతో బాయి దగ్గరికి వెళ్లి పరిశీలించగా బాయిలో చెప్పులు కనిపించడంతో వెంటనే చుట్టుపక్కల వారిని తీసుకు వెళ్లి బాయి లో వెతుకుగా బావిలో కనిపించాడు నారాయణరెడ్డి తెలిపారు.