Sep 17,2023 21:47

విజేతలకు బహుమతులను అందజేస్తున ఎపిఒ రోషిరెడ్డి

సీతంపేట : ఒలింపిక్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంటు స్థానిక ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో కురుపాం (రవి, నిఖిల్‌) జట్టు విన్నర్‌ కాగా, శ్రీకాకుళం (అభిరాం, ఇజ్రాయిల్‌) జట్టు రన్నర్‌గా నిలిచాయి. ఈ పోటీలను ఐటిడిఎ ఎపిఒ వై.రోసిరెడ్డి, ఎస్‌ఐ ఎ.నీలకంఠ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు మండల స్థాయి నుండి జాతీయస్థాయికి ఎదగాలని అన్నారు. క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుండి 50 టీములు పాల్గొన్నాయి. ఈ ఒలింపిక్స్‌లో ఐటిడిఎ స్పోర్ట్స్‌ ఇన్‌ఛార్జ్‌ ఎన్‌.జాకబ్‌ దయానంద్‌, ఇంటర్నేషనల్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌ రిఫరీ సూరిబాబు, మన్యం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ అధ్యక్షులు ఎం.రామకృష్ణ, సురేషు, మధు, రాములు పాల్గొన్నారు.