ధ్రువపత్రం అందజేస్తున్న అధికారులు
ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని చిన్నహ్యాట, మడ్డిలింగదల్లి గ్రామాల్లో శనివారం జరిగిన వార్డు సభ్యుల ఉప ఎన్నికలో ఒకటి టిడిపి గెలుపొందగా, ఒకటి వైసిపి గెలుపొందింది. చిన్నహ్యాట పంచాయతీలో టిడిపి బలపరిచిన అభ్యర్థి సిహెచ్.మంగమ్మ గెలుపొందగా మడ్డిలింగదల్లి గ్రామంలో వైసిపి బలపరిచిన గోపులమ్మ గెలుపొందారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గెలపొందినట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు, హోళగుంద ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.










