ప్రజాశక్తి -పెద్దకడబూరు : పెద్ద కడబూరు మండలంలోని ముచ్చిగిరి గ్రామ శివారులోని జలజీవన్ మిషన్ కింద రూ 27.33 లక్షల వ్యయంతో నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఆదివారం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముచ్చుగిరి గ్రామా ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇందులో మండల వైసీపీ నేతలు పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీపీ రఘురాం చిన్న తుంబలం మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప పరిశప్ప చిన్న కడబూరు జాముఖన్న తదితరు వారు తదితరు వారు పాల్గొన్నారు.










