ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : మచిలీపట్నం మండలం లోని పొట్లపాలెం, సుల్తానగరం ఎస్ ఎన్ గొల్లపాలెం గ్రామాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న మినుము పంటను వ్యవసాయ అధికారి జివి. శివప్రసాద్ , ప్రజాప్రతినిధులతో కలసి సోమవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రకాలుగా దెబ్బతిన్న పంట ను గమనించటం జరిగిందన్నారు. కొంత మేర మినుము పీకకుండా వుందిని అటువంటి చోట కూడా కాయ లోని గింజలు మెత్తపడటం, మొలక రావటం కూడా జరిగిందన్నారు.పీకి పనల మీద వున్న చోట కాయలు బూజు పట్టి వుండటం చూడటం జరిగింది. కుప్పలు గా వున్న చోట కింద వైపు సరిగా పరదా కప్పని చోట కాయలు బూజు మరియు మొలకలు రావటం కూడా జరిగింది. అపరాల మరియు నూనె గింజల శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పీక కుండా వున్న పొలం లో గింజలు మొలక రాకుండా 5% ఉప్పు నీటి ద్రావణం స్ప్రే చేసినట్లయితే కొంత మేరకు మొలకను అరికట్టవచ్చునని, అలానే పనలమీద బూజు రాకుండా 2 గ్రాముల మాంకోజెబ్ లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసినట్లుయితే బూజు తెగులు కొంత వరకు నివారణ చేయవచ్చని రైతులకు చెప్పటం జరిగింది.నష్టం ఎక్కువ గా వుంటే సంబంధిత గ్రామ రెవిన్యూ అధికారి తో కలిసి గ్రామ వ్యవసాయ సహాయకులు రైతు ల సమక్షంలో పంట నష్ట అంచనా వేయాలని ఆదేశాలు జారిచేయటం జరిగింది.ప్రతి పొలం లో కూడా రైతులు మరియు అధికారులు తప్పకుండ ఫోటో దిగి భద్ర పరచవలసింది గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది.ఈ పర్యటన లో పొట్లపాలెం లో సర్పంచ్ నాగరాజు,పి ఏ సీ ఎస్ అధ్యక్షులు నాగబాబు, రైతులు మారుతీ, ఎస్ ఎన్ గొల్లపాలెం గ్రామ ఇంచార్జి మట్టా మోహన నాంచారయ్య, రైతులు గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ, మహాలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు










