May 28,2023 15:46
  • టిడిపి జిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ రావు 

ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కృషి ఉంటే మనుషులు రుషులౌతారు  మహా పురుషులౌతారు.అన్న మాటలకు నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ ఎన్టీ రామారావు అని  కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, బందరు మాజీ పార్లమెంటు సభ్యుడు, కొనకళ్ళ నారాయణరావు పేర్కోన్నారు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా కేక్ కట్ చేసి స్వర్గీయ ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  నారాయణరావు  సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు టిడిపిని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించారన్నారు. 9 నెలలోనే ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలనలోనే మార్పులు తీసుకువచ్చిన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువాడి ఔన్నత్యాన్ని ఆంధ్రుల ఆత్మాభిమానంను విశ్వ వ్యప్తం గావించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి అయినాడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. రాజకీయంగా బీసీలకు అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి, కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలు ఎన్నో నటించి ప్రజల మనస్సులను దోచుకున్న మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ అన్న ఎన్టీఆర్ అన్నారు. కేవలం సినీ నటుని గానే గాక రాష్ట్రంలో, దేశంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తన వంతు బాధ్యత ఎప్పుడూ నిర్వర్తిస్తూ, ప్రజా హృదయాలను తన సామాజిక కార్యకలాపాలతో కూడా ఆకర్షించారన్నారు. 1952లో రాయలసీమ కరువు తాండవించినప్పుడు, 1965లో భారత్-పాక్ యుద్ధ సమయంలో, జాతీయ రక్షణ నిధి కోసం 1977లో దివిసిమ ఉప్పెనకు గురైనప్పుడు రాష్ట్ర, దేశ ప్రజలను ఆదుకోవడానికి నడుంబిగించిన తొలి తెలుగు సినీ నటుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కొనకళ్ళ జగన్నాథరావు (బుల్లయ్య), నియోజకవర్గ కార్యాలయ ఇంచార్జ్, యశ్వంత్ వర్మ,  పార్టీ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎండి ఇలియాస్ పాషా, పిప్పళ్ళ వెంకట కాంతారావు, మునిసిపల్ మాజీ చైర్మన్ , మోటమర్రి వెంకట బాబా ప్రసాద్,మరియు  పంచ పర్వాల కాశీ విశ్వనాథం, కాగిత వెంకటేశ్వరరావు, పి.వి ఫణి కుమార్, కాసాని భాగ్య రావు, తలారి సోమశేఖర్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, అక్కుమంతి రాజా, లంకే శేషగిరి, పాలపర్తి పద్మజ, తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు  ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.