Sep 28,2023 07:51

న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లో 50 చోట్ల ఈ దాడులు జరిగాయి. ఖలిస్థానీ అంశంపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. భారత్‌లోని ఖలీస్థానీ మద్దతుదారులకు ఇతర దేశాల నుంచి హవాల మార్గంలో డబ్బులు వస్తున్నాయని.. వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్‌, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్‌ఐఎ ఆరోపిస్తుంది. వీరికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉపా కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలిపారు. బుధవారం పంజాబ్‌లో 30 చోట్ల, రాజస్థాన్‌లో 13, హర్యానాలో నాలుగు చోట్ల, ఉత్తరాఖండ్‌లో రెండు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కో చోట తనిఖీలు బుధవారం సాయంత్రం వరకూ సోదాలు జరిగాయి.