ప్రజాశక్తి-బంగారు పేట : స్థానిక బంగారు పేట నందు గల భారత్ బజాజ్ షోరూంలో సంస్థ ఎం.డి ఎస్.అక్తర్ హుస్సేన్ మరియు కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ సి. బాలాజీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన బజాజ్ పల్సర్ యన్ 150 ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అక్తర్ హుస్సేన్ మాట్లాడుతూ 2001లో పల్సర్ లాంచ అయిందని అప్పటినుంచి దినదిన అభివృద్ధి చెందుతూ సాటి లేని బైక్ గా నిలిచిందని తెలిపారు. ఈరోజు ఎన్ యన్ 150 ని తమ షో రూమ్ లో లాంచ్ చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. ఒక మంచి స్పోర్ట్స్ బైక్ అని మంచి మైలేజ్ తో వస్తుందని తెలిపారు. దీని సిసి 149.68, బరువు 145 కేజీల, డిస్క్ బ్రేకుల, ట్యూబ్ లెస్ టైర్ల, ఎయిర్ కూలెంట్ ఇంజన్, మైలేజ్ 55 కిలోమీటర్లు లీటర్ కి ఇలా అనేక ఫీచర్స్ తో అద్భుతమైన బైక్ అని కొనియాడారు.










