Sep 13,2023 12:37

జైపూర్ :   రాజస్తాన్‌లోని కోటాలో నీట్‌ విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం రాత్రి మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 23కి చేరింది.

జార్ఞండ్‌కు చెందిన రిచా సిన్హా మంగళవారం రాత్రి హాస్టల్‌ గదిలో ఫ్యానుకు ఉరివేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 10.30 గంటలకు ఈ ఘటన జరిగిందని అన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి వుందని, ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని సీనియర్‌ పోలీస్‌ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని అన్నారు.

కోటాలోని విద్యార్థులకు రెండు నెలల వరకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు విద్యార్థులకు శిక్షణనివ్వాలని పేర్కొంది.