ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. న్యాయానికి సంకెళ్లు పేరిట నిరసనలతో హోరెత్తించారు. చేతికి తాళ్లు, రిబ్బన్లతో సంకెళ్లు వేసుకొని ఆదివారం రాత్రి 7గంటల నుంచి 7.05గంటల వరకు నిరసన తెలిపారు. పార్వతీపురం పట్టణంలో ఐటిడిపి పట్టణ అధ్యక్షులు బార్నాల సీతారాం ఆధ్వర్యాన నిర్వహించారు. అలాగే మండలంలోని కృష్ణపల్లిలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నర్సిపురంలో మాజీ ఎంపిపి గొట్టాపు గౌరీ ఆధ్వర్యంలో సత్యానికి సంకెళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అభిమానులు
సాలూరురూరల్ : మండలంలోని బాగువలసలో టిడిపి నాయకులు చేతికి సంకెళ్లు వేసుకొంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఆమదాల పరమేష్, మహిళా నాయకులు మత్స సాయి, శ్యామ్, శ్రీను పాల్గొన్నారు.
మక్కువ : మండలంలోని ఎ.వెంకంపేటలో చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా మండల మాజీ టిడిపి అధ్యక్షులు పెంట తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంకెళ్లు వేసుకుంటూ నిరసన తెలిపారు.
గుమ్మ లక్ష్మీపురం : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కు నిరసనగా న్యాయానికి సంకెళ్లు అనే కార్యక్రమాన్ని గుమ్మలక్ష్మీపురం, జియమ్మ వలస మండలాల్లో నిర్వహించారు. కార్యక్రమం లో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీతంపేట: జిల్లేడుపాడులో చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంఘీభావంగా చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి జయకృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, సీతంపేట బీసీ సెల్ అధ్యక్షులు ఆర్ రంగనాధం,ఏస్సి సెల్ అధ్యక్షులు గంట సుధ,ఐటీడీపి హిమరక పవన్,క్లస్టర్ ఇంచార్జ్ నిమ్మక చంద్రశేఖర్, మహాశక్తి ప్రచార కర్త తోయిక సంధ్యా రాణి,పాలక శశికళ, నిమ్మక రోజా, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమదాలలో బాబుతో నేను కార్యక్రమంలో
పార్వతీపురంరూరల్: మండలంలోని జమదాలలో సర్పంచ్ రెడ్డి భారతి, ఎంపిటిసి సభ్యులు శ్రీనివాసరావు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు గొట్టాపు వెంకటనాయుడు ఆధ్వర్యంలో బాబుతో నేను అన్న కార్యక్రమం నిర్వహించారు. అలాగే నరిసిపురంలో మాజీ వైస్‌ఎంపిపి గొట్టాపు గౌరి, నాయకులు వెంకటరమణ సారధ్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి బాబు అక్రమ అరెస్టు గురించి వివరించారు.
పాలకొండ : మండలంలోని కొండాపురంలో బాబు తో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడును అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించిన విధానాన్ని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ నిమ్మక జయకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కర్నెన అప్పలనాయుడు, పాలకొండ పట్టణ టిడిపి అధ్యక్షులు గంట సంతోష్, మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, ఎంపిటిసి సభ్యులు కరణం నారాయణరావు, సర్పంచ్ రాయి రామకృష్ణ, కొండాపురం గ్రామా పెద్దలు, క్లస్టర్ ఇంచార్జ్ లు,యూనిట్ ఇంచార్జ్ లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : జియమ్మవలస మండలం అలమండ గ్రామ పంచాయితీ, చినతోలు మండలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ గురించి గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి టిడిపి నాయకులు వివరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, అరుకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్, ఎస్టీ సెల్ అరుకు పార్లమెంటు అధికార ప్రతినిధి నందివాడ కష్ణబాబు, అరుకు పార్లమెంట్ కొప్పలవెలమ సాధికార సమితి అధ్యక్షులు మూడడ్ల సత్యం నాయుడు, వైస్ ఎంపిపి బిడ్డిక నరేష్ , పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉరిడిలో...
కురుపాం : మండలంలోని ఉరిడి పంచాయతీలో బాబుతో నేను అనే కార్యక్రమం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి టి.జగదీశ్వరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరిడి, గుంజరాడ, తుమ్మికిమానుగూడ, కోరాడగూడ గిరిజన గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడ్ని వైసిపి ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టులు గూర్చి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీకోఆప్షన్ సభ్యులు రంజిత్ కుమార్ నాయక్, టిడిపి నాయకులు పోలూరు శ్రీను, యూనిట్ ఇన్చార్జ్ వెంకటేశ్వరరావు, బూత్ ఇన్చార్జులు బి. యువరాజు భగవాన్, తిరుపతి, మల్లి తదితరులు పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : మండలంలోని గంగన్నదొరవలస బాబుతో నేను అన్న కార్యక్రమం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ గ్రామంలో గల రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఆముదాల పరమేష్, సర్పంచ్ తొత్తడి నారాయణమ్మ, నూకరాజు, రామకృష్ణ, వెంకటరమణ, బొర్రాన్న దొర, భాస్కర రావు,లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.










