matladutunna mpp supraja
నవరత్న పథకాలతో పేదలకు ఎంతో మేలు
పమిడిముక్కల ఎంపిపి కాసాని వేదసుప్రజ
ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాలకు అన్ని తరగతుల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పమిడిముక్కల ఎంపిపి కాసాని వేద సుప్రజ అన్నారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలపై అవగాహన నిమిత్తం మండలంలోని వీరంకిలాకులో బుధవారం వాలంటీర్లు, గృహసారధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిఎం వైఎస్ జగన్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ నిరంతరం అభివృద్ధే ధ్యేయంగా కృషిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పమిడిముక్కల మండల సచివాలయాల కన్వీనర్ పరసా జగన్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కొడమంచిలి మహేష్, సచివాలయ సిబ్బంది, గృహసారధులు తదితరులు పాల్గొన్నారు.










