Aug 04,2023 22:54

ప్రజాశక్తి - మచిలీపట్నంఅర్బన్‌ : యువత నమ సమాజ స్థాపనకు పునాది వేయాలని, చట్టంపై అవగాహన పెంచుకోవాలని, దేశభక్తిని పెంచే విధంగా నడుచుకోవాలని కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కేవిఆర్‌ కష్ణయ్య అన్నారు. స్థానిక పద్మావతీ మహిళా కళాశాలలో శుక్రవారం కృష్ణా డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అధ్వర్యంలో విద్యార్థినులకు ర్యాగింగ్‌ చట్టాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ జె అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి కష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థినులు రాగింగ్‌ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నేటి యువత డ్రగ్స్‌ కు బానిసలు అవుతున్నారని, ఉజ్వల భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని చెప్పారు. డ్రగ్స్‌ వినియోగం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని వాటికి దూరంగా ఉండాలని కోరారు. సెల్‌ ఫోన్లకు యువత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని వాటి మోజులో పడి కొత్త పరిచయాలు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సి హెచ్‌ ముసలయ్య, రెడ్‌ క్రాస్‌ జిల్లా కార్యదర్శి బి శంకర్‌ నాథ్‌, సైక్రియాటిస్ట్‌ ఎం సబ్రమన్నేశ్వరరావు, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఎల్‌ గోపీనాథ్‌, బుల్లి అప్పారావు, స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జడ్జి వెంకట వాహిని, కె శ్రావణి పాల్గొన్నారు.