Apr 23,2023 22:09

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, తదితరులు

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : కదిరి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మరో నూతన సముదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. కదిరి పట్టణంలోని శ్రీమద్‌ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానమునకు సంబందించి గతంలో ఉన్న శ్రీ చలపతినాయుని సత్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసిన (శ్రీ అమత వళ్ళి సదన్‌) నూతన వసతి సముదాయాన్ని ఎమ్మెల్యే సిద్దారెడ్డి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి సౌకార్యములలో భాగంగా దేవస్థానం నిధులతో 32 వసతి గదులను అధునాతన హంగులతో నిర్మించి అందుబాటులోనికి తీసుకొని వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌ , ఆలయ కమిటీ ఛైర్మెన్‌ జెరిపిటి గోపాల క్రిష్ణ, ఎడి.పార్థసారథి చార్యులు, ప్రధాన అర్చకులు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనర్‌, ఎస్‌.సతీష్‌, డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, శ్రీనివాస్‌ ప్రసాద్‌ , అంజన్‌ కుమార్‌ చార్యులు ముఖ్య అర్చకులు, ఆలయ పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.