ప్రజాశక్తి - ముసునూరు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరినీ ఆదుకుంటున్నారని నూజివీడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ మేకావెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు. గురువారం మండల కేంద్రమైన ముసునూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ జి.రాణి ఆధ్వర్యంలో నూతన ఫించన్లు 285 మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరినీ ఆదుకుంటున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి సభ్యులు డాక్టర్ ప్రతాప్, ఎంపీపీ రాపర్ల కృష్ణకుమారి, సుబ్బారావు, వైస్ ఎంపీపీ కోటగిరి రాజా నాయనా, వైస్ ఎంపీపీ-2 పాముల గంగాధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల శాఖ అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










