Sep 05,2023 17:57

    పోలవరం : సచివాలయాల పరిధిలో నూతనంగా మంజూరైన ఫించన్లను సర్పంచి పొడుం పుష్ప, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. సర్పంచి పొడుం పుష్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీకి అనుగుణంగా దఫదఫాలుగా ఫించన్‌ పెంచుతున్నారన్నారు. వాలంటీర్‌లు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఫించన్లు అందజేస్తురాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.శ్రీను, ఎంపిటిసిలు యామల శ్రీదేవి, కాశీ ధనలక్ష్మి, పంచాయతీ వైస్‌ ప్రెసిడెంట్‌ కొరశిక శ్రీను, వార్డు మెంబర్లు మంగిన వెంకటరమణ(కొండబాబు), వైసిపి యువ నాయకులు పొడుం శ్యామ్‌ కుమార్‌ పాల్గొన్నారు.