పింఛను అందజేస్తున్న సర్పంచ్
ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని గసభ పంచాయతీలో నూతనంగా మంజూరైన 21 మంది లబ్ధిదారులకు ఆ పంచాయతీ సిపిఎం సర్పంచ్ పి సునీత గురువారం లబ్ధిదారులకు పింఛన్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ పింఛన్లను సద్వినియోగ పరచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఎంపిటిసి వి జేమ్మ , మాజీ సర్పంచ్ పి సురేష్ కుమార్, ఉప సర్పంచ్ మహాదేవ్, వార్డ్ సభ్యులు సత్యనారాయణ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.










