ఎస్పీని కలిసిన ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : జిల్లా నూతన ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎస్ వి మాధవరెడ్డిని శ్రీ సత్య సాయి జిల్లా ఎమ్మెల్యేలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుట్టపర్తి,కదిరి, పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎస్పీని జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించాలని ఎస్పీ ఈ సందర్భంగా వారిని కోరారు. అదే విధంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డిని ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె ఎస్పీకి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఉమ్మడి జిల్లాలోని పరిస్థితులను ఎస్పీకి వివరించారు.










