ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పట్టణంలోని 53 అభివృద్ధి పనులను ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే స్వగృహం నుండి బైక్ ర్యాలీతో నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, భారీ ఎత్తున బయలుదేరి వెళ్లారు. అనంతరం గూడ్‌షెడ్ కొట్టాలలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుమునకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. మొత్తం 30చోట్ల 53 పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మొత్తం 53 పనులను రూ. 10.42 కోట్లతో చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు చందమూరినారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పెనుజూరి నాగరాజు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, కుండా చౌడయ్య, కేతా లోకేష్, నీలూరి వెంకటరాముడు, చెలిమి రామకష్ణమ్మ,తీర్థాల స్వర్ణలత, తదితరులతోపాటు కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు కేశవరెడ్డి, రమేష్ బాబు, రామయ్య , ఖాదర్ వలీ , ఇనాయతుల్ల తదితరులు పాల్గొన్నారు.










