Oct 21,2023 00:47
మాట్లాడుతున్న టిడిపి ఎస్‌సి సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు

ప్రజాశక్తి-పామూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్‌ రాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పువ్వాడి రాధాకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో విలేకరుల సమావేశంలో ఎమ్మెస్‌ రాజు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా సైకిల్‌ పాదయాత్ర కార్యక్రమం పామూరు చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెస్‌ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి దళితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు. గౌరవప్రదమైన పదవులు అగ్రకులాలకు ఇచ్చి, గౌరవం లేని, కుర్చీలు లేని పదవులు దళితులకు ఇచ్చి అవమానించిన ఘనత జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ పార్టీ ఓడించి ఖాయమన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర జయ ప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిపరులకు స్వేచ్ఛ ఇవ్వడంతో సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు స్వామి చెన్నకేశవులు, గోనె ప్రతాప్‌, మల్లికార్జున, వెంకటయ్య, చిన్న కొండయ్య వీరితోపాటు పట్టణానికి చెందిన టిడిపి నాయకులు పువ్వాడ వెంకటేశ్వర్లు, షేక్‌ రహమతుల్లా, బొల్లా నరసింహారావు, అమీర్‌బాబు, ప్రసాద్‌రెడ్డి, ఎం రమణయ్య, కోటిరెడ్డి, శేషు, మాల్యాద్రి, మౌలాలి పాల్గొన్నారు.