ప్రజాశక్తి-యర్రగొండపాలెం : ఇటీవల లండన్‌లో ఉన్నత విద్య అభ్యశించేందుకు వెళ్లి గుండె పోటుతో మతి చెందిన యర్రగొండపాలెం మండలంలోని అమానుగుడిపాడు గ్రామానికి చెందిన జమ్మి సుబ్బారావు జ్ఞాపకార్ధం శుక్రవారం యర్రగొండపాలెం పట్టణంలోని సన్‌జో సేవాలయంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులలకు సుబ్బారావు కుటుంబ సభ్యులు దుప్పట్లు, నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు, టిడిపి సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర మాట్లాడుతూ ఉన్నత చదువు కోసం వెళ్లి పొరుగుదేశంలో మృతి చెందడం బాధాకరమన్నారు. సుబ్బారావు ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చేకూరి ఆంజనేయులు, కోటా డేవిడ్, కాకర్ల కోటయ్య, చిట్టేల వెంగళరెడ్డి, చేదూరి కిశోర్, కొత్త భాస్కర్, తోటా మహేష్ నాయుడు, వేగినాటి శ్రీనివాస్, వడ్లమూడి లింగయ్య పాల్గొన్నారు.










