మాట్లాడుతున్న సిపిఎం పట్టణ కార్యదర్శి రణధీర్ తదితరులు
నిత్యావసర ధరలు తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి - ఆత్మకూర్
రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర ధరలు కూరగాయల, గ్యాస్, విద్యుత్ చార్జీల ధరలు తగ్గించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, పట్టణ నాయకులు డి. రామ్ నాయక్, జి నాగేశ్వరరావు, ఏ సురేంద్ర, షేక్ ఇస్మాయిల్‌లు డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలు కూరగాయలు కొనలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఇవికాక వంట గ్యాస్, విద్యుత్ చార్జీల ధరలూ పెరిగడంతో సామాన్యులకు భారీగా ఆర్థిక భారం పడుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు తగ్గించడంలో ఘోరంగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తక్షణమే నిత్యావసర ధరలు తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.










