ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరి ప్రభుత్వాస్పత్రిలో 108 వాహనం నిరుపయోగంగా మిగిలిపోయింది. 108 వాహనం పని చేయడం లేదా అని అక్కడ ఉన్న పిహెచ్‌సి సిబ్బందిని అడగగా ఈ వాహనానికి 5 లక్షల కాలపరిమితి అయిపోయిందని, అందుకోసమే పక్కన పెట్టినట్లు తెలిపారు. బస్సు సౌకర్యం లేని 9 గ్రామాల ప్రజలు ఆస్పత్రికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 108 వాహనం నిరుపయోగంగా ఉంటే సంబంధిత అధికారులకు ఎవరికీ పట్టడం లేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారు మాట్లాడుతూ... చిప్పగిరిలో ఒక 108 వాహనం పని చేస్తోందని, మిగిలిన ఇంకో వాహనం నిరుపయోగంగా ఉందని తెలిపారు. దీనికి కూడా అధికారులు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తెస్తే ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి నిరుపయోగంగా ఉన్న 108 వాహనానికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
పిహెచ్‌సి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న 108 వాహనం










