నిరసనల పర్వం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
ఈ వారం రోజుల్లో నంద్యాల జిల్లా వ్యాప్తంగా నిరసనల పరంపర కొనసాగింది. పలు రంగాల్లో సమస్యలపై కార్మికులు, కర్షకులు, నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్నుత్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి పోరాట నిర్వహిస్తుందని, ఢిల్లీకి వినిపించేలా ఈ నెల 30న జరిగే ఛలో విజయ వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం నాయకులు కోరారు. పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు, భారాలపై ఈ నెల 30న నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. పలు ప్రాంతాల్లో నాయకులు మహాధర్నా గోడపత్రికలను విడుదల చేశారు. జిల్లాలోని 29 మండలాలలోని గ్రామాలలో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ వేతనాలు దాదాపుగా పది నెలలు ఉన్నాయని వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. గాజులపల్లె గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో మహానంది తహాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
ప్రబలిన అతిసార : బనగానపల్లె మండలంలోని పలుకూరు గ్రామంలో ప్రజలు అతిసారా ప్రబలింది. గ్రామంలోని కొత్తపేట కాలనీలో 60 మంది వాంతులు, విరేచనాలతో మంచం పట్టారు. శుక్రవారం రాత్రి 16 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం నుంచి దాదాపు 44 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వీరందరూ నంద్యాల, బనగానపల్లె, పలుకూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోని శుభ్రం చేయని వాటర్ ట్యాంకు నీళ్లు తాగి వాంతులు, విరేచనాలతో ప్రజల అవస్థలు పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాటర్ ట్యాంకును సంవత్సరాలు గడుస్తున్నా శుభ్రపరచకుండా సరఫరా చేసిన నీటిని తాగడం వల్లే ప్రజలు అతిసార బారిన పడ్డారు. కాలనీలో తాగునీటి పైపులైన్లు మురికి కాలువల్లో వేయడం, పైపుల లీకేజీతో మురికి నీరు అందులోనికి వెళ్లుడంతో కలుషితమయింది. ఆ నీరు తాగి వాంతులు, విరేచనాలతో గురైనట్లు కాలనీ ప్రజలు తెలిపారు.
ఉద్రిక్తతల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ : అవుకు మండలం సుంకేసుల గ్రామంలో మైనింగ్ లీజుల ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతల మధ్య సాగింది. భారీ పోలీసు బందోబస్తుతో అధికారులు సమావేశాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని సుంకేసుల గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ మైనింగ్ భూమి సర్వే నెంబర్ 333/3, 333/2లో సుమారు ఐదు ఎకరాలకు పైగా మైనింగ్ లీజు అనుమతులు పొందేందుకు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి చిలకల నారాయణరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.
eevaram nandayala










