ప్రజాశక్తి-పెద్దకడబూరు
మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఘటనలో నిందితులను శిక్షించాలని ప్రజా, కులసంఘాలు, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్దకడబూరులో దళిత, క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సబ్ స్టేషన్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఫ్లకార్డులు చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాస్టర్ మనోహర్ బాబు, ఫాదర్ సంజీవరావు మాట్లాడారు. మణిపూర్ రాష్ట్రంలో క్రైస్తవులపై, ప్రార్థన మందిరాలపై మైతి తెగకు చెందిన వారు హింసకాండ సాగిస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో దాడులను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. మత పెద్దలు ఏలియా, ఏసేపు, బొగ్గుల తిక్కన్న, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, పరమేష్, సిఐటియు నాయకులు ఈరన్న పాల్గొన్నారు.
ర్యాలీనుద్దేశించి మాట్లాడుతున్న నాయకులు










