Nov 02,2023 18:30

మాట్లాడుతున్న ఎంపీపీ మూలే పద్మజ

మాట్లాడుతున్న ఎంపీపీ మూలే పద్మజ
నీటి సమస్యను పరిష్కరించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి:మండలంలో తాగునీటి సమస్యలు మౌలిక వసతులపై సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కషి చేయాలని ఎంపీపీ మూలే పద్మజా వినరు రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక స్త్రీ శక్తి భవనంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ ఈశ్వరమ్మ అధ్యక్షతన ప్రారంభించారు. జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు 17 పంచాయతీల్లో నెలకొన్న నీటి సమస్యలు విద్యుత్‌ సమస్యలు తక్షణం పరిష్కరించాలన్నారు. జగనన్న సొంతింటి కలను గ్రామాలలో సొంత స్థలం గల వారికి జగనన్న ఇళ్లు కల్పించి వారి కలలు నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలలో ఎరువులు పురుగుమందులు అందుబాటులో ఉంచి అవసరాలకు రైతులకు అందించాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు సచివాలయ సిబ్బంది కషిచేయాలన్నారు.
అనంతరం వెంగళరావు నగర్‌ సర్పంచ్‌ ఎం తిరుపతి, గన్నేపల్లి పంచాయతీ సర్పంచ్‌ వెంకటస్వామి నాయుడు ప్రస్తుత నెలలోనే నీటి సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. నూతన బోరులు ఏర్పాటు మోటార్‌ మరమ్మతులకు నగదు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ శాఖ ఉపాధి హామీ రెవెన్యూ సమస్యలపై సంబంధిత అధికారులు చర్చించి సమస్యలకు పరిష్కారం వివరించారు. ఆర్‌డబ్ల్యు డిఇఇ నీటి సమస్య ఉన్న గ్రామాలలో టాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల నుండి సమాచారం వచ్చిందని, నేటి సమస్య ఉన్న సర్పంచులు తెలిపితే నీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గుండుపల్లి మాలకొండయ్య చౌదరి మండల కన్వీనర్‌ ఓబుల్‌ రెడ్డి మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య, ఎస్దాని ఎంపీటీసీ గొల్లపల్లి తిరుపతయ్య, సర్పంచులు పాములూరి సామ్రాజ్యం, సత్తెనపల్లి వరలక్ష్మి, గొల్లపల్లి కల్పన కల్లూరి వెంకటేశ్వర రెడ్డి, సుభాని, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.