Oct 18,2023 22:59

తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తులు


ప్రజాశక్తి-పుల్లలచెరువు
మండలంలోని మర్రివేముల గ్రామంలోని ఈ మధ్య కురిసిన తేలికపాటి వర్షానికి స్థానిక చెరువులో కొద్దిపాటు నీరు వచ్చింది. అయితే చెరువు చుట్టూ 15 వ్యవసాయ బోర్లు ఉన్నాయి. చెరువులోని నీరంతా బోరు బావులు పీల్చుకున్నాయి. దీంతో గ్రామంలోని బోర్లన్ని మొరాయిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బుధవారం మర్రివేముల గ్రామస్తులు తహశిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. విషయం తెలుసుకున్న తహశిల్దార్‌ దాసు మండలంలోని గంగవరంలో జరుగుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నుంచి మధ్యలోనే పుల్లలచెరువు వచ్చి నిరసన కారులకు నచ్చజెప్పారు. సమస్యను పరిష్కరిస్తాననని హామీ ఇచ్చారు. దీంతో మర్రివేముల గ్రామస్తులు ధర్నాను విరమించారు.