Aug 15,2023 15:46

ప్రజాశక్తి -మామిడికుదురు
నగరం పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐగా పి.సురేష్‌ సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంతకు ముందు రాయవరం ఎస్‌ఐగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇంతవరకు ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ జానీబాషా పామర్రు స్టేషన్‌కి బదిలీపై వెళ్లారు. నూతన ఎస్‌ఐగా భాద్యతలు చేపట్టిన సురేష్‌కు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... శాంతి భద్రతల పరిరక్షణకు కషి చేస్తానని, నేరాల అదుపులో ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు అందర్నీ సమన్వయం చేసుకుంటూ సమస్యలు పరిష్కారానికి చొరవ తీసుకుంటామని ఆయన చెప్పారు.